ఎంజీఎం హాస్పిటల్ లో పాముల కలకలం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో పాముల కలకలం ఇటు పేషంట్లను పేషెంట్ అటెండర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా శుక్రవారం హాస్పిటల్ లోని ఫీవర్ వార్డులో పాము కలకలం రేపింది. దీంతో పేషెంట్లు పేషంట్ అటెండర్స్ భయభ్రాంతులకు గురయ్యారు. చివరికి పాములు పట్టే వ్యక్తి వచ్చి పామును పట్టుకొని వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఇటీవల ఎంజీఎం లో ఎంజీఎం ప్రాంతంలో పాములు సంచరించడం జరుగుతుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాముల బారిన పేషంట్ గాని హాస్పిటల్ కి వచ్చే ప్రజలు గాని ఇబ్బంది పడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.