ఎంజీబీఎస్ నిలిచిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు
హైదరాబాద్, జనంసాక్షి: వామపక్షల బంద్ నేపథ్యంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే ఎంజీబీఎస్ ఇవాళ ఖాళీగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఎంజీబీఎస్ ట్రాఫిక్ మేనేజర్ చందర్ మీడియాతో మాట్లాడారు. రోజూ 35 వేల మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చే వారిని, ఇవాళ మాత్రం 10 వేల మంది ప్రయాణికులు మాత్రమే వచ్చారని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి 550 బస్సులు బయల్దేరాల్సి ఉంటే, 330 బస్సులు మాత్రమే ఇతర ప్రాంతాలకు బయల్దేరి వెళ్లాయని పేర్కొన్నారు.