ఎండలు సైతం లెక్కచేయకుండా కాలినడకన పలు గ్రామాలను సందర్శించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,,   శనివారం  9వ రోజైన   పల్లె ప్రగతి లో భాగంగా   కుభీర్ మండలం లోని  మాలెగామ్,  నిగ్వా,  తానూర్  మండలం లోని  భోసి   గ్రామాలలో   సందర్శించి  పల్లెప్రగతి లో చేపడుతున్న  పలు   కార్యక్రమాలను   పరిశీలించారు.
ఈ సందర్బంగా  జిల్లా పాలనాధికారి  అదనపు  కలెక్టర్  హేమంత్ బోర్కడే తో  కలసి   మాలెగామ్ లోని  మండల పరిషత్  ప్రాధమిక  పాఠశాల మనఊరు  మనబడి  క్రింద  మోడల్ స్కూల్ గా  ఎంపికైనందున  స్కూల్  మరమ్మత్తులను   పరిశీలించి    స్కూల్  ఆవరణలో   మొక్కలు నాటి  డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల  నిర్మాణం పనులను   పరిశీలించారు.
అనంతరం   నిగ్వా జిల్లా పరిషత్  సెకండరి  పాఠశాల మోడల్ స్కూల్ ను,  పల్లెప్రకృతి  వానలను, తానూర్ మండలం  భోసి  గ్రామంలోని పల్లె ప్రకృతి వనాలు,  మోడల్ స్కూల్  ను పరిశీలించి   ఎండలో  కాలినడకన గ్రామాల్లో  తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ప్రజలతో   మాట్లాడుతూ   ఎలా ఉన్నారు?  ఆరోగ్యం ఎలావుంది,  పెన్షన్ వస్తుందా?   అని   అడిగి తెలుసుకొన్నారు.     పెన్షన్ డబ్బులు వస్తున్నాయని,  బాగున్నామని తెలిపారు.
గ్రామాల్లోని  డ్రైనేజీ లను   పరిశీలిస్తూ   ఎప్పటికప్పుడు  కాలువలను   శుభ్రం చేయాలని,  ప్లాస్టిక్,  తదితర  వస్తువులు కాలువలో వేయకుండా   ట్రాలి వచ్చినపుడు   అందులో  వేయాలని,   శుభ్రత పాటిస్తూ   డెంగ్యూ  వ్యాధి రాకుండా   అప్రమత్తంగా  ఉండాలని  సలహాలు, సూచనలు చేశారు.
పల్లె ప్రకృతి  వనాలు   చాలా బాగున్నాయని  అధికారులను   అభినందించారు.
ఈ కార్యక్రమం లో తహసీల్దార్
విశ్వంబర్, ప్రత్యేక  అధికారులు, ఎంపీడీఓ,  epo,  పంచాయతీ సెక్రెటరీ,  తదితరులు పాల్గొన్నారు.