ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాలను పంపిణీ చేసిన ఎంపీపీ స్వరూప

 

రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామ ప్రజలకు అన్ని గ్రామాల కార్యదర్సులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈనెల 13 న తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గట్ల మీనయ్య, ఎంపీడీవో శంకర్, ఎస్సై విజయ్ కుమార్, ఎంపీ ఓ సుధాకర్ అన్ని గ్రామాల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.