ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ అరెస్టు
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎంపీలు మందా జగన్నాథం, వివేక్, తెరాస నేతలు వినోద్, జితేందర్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు నిజాంక్లబ్ వద్దకు చేరుకున్న ఎంపీలు, తెరాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ… పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచలేరన్నారు. చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.