ఎంసెట్ ర్యాంకుల వెల్లడి తేదీ వాయిదా?
హైదరాబాద్ : ఎంసెట్ `2013 ర్యాంకుల వెల్లడి వాయిదా పడే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం జూన్ 2వ తేదీన ర్యాంకులను వెల్లడిరచాల్సి ఉంది. అయితే… అదేరోజు జేఈఈ అడ్వాన్డ్సు పరీక్ష, జివ్‌మర్ ఎంట్రెస్స్ జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఉత్కంఠకు గురికాకుండా ఉండేందుకు ర్యాంకుల వెల్లడిని వాయిదా వేయాలన్న ప్రతిపాదనపై అధికారులు యోచిస్తున్నారు. ఒకవేళ వాయిదా వేసినా జూన్ 5లోపే ర్యాంకులను వెల్లడిస్తామని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయప్రకాష్‌రావు చెప్పారు.