ఎక్కువ మొక్కలు నాటిన వారికి అవార్డులు

ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి: కలెక్టర్‌

నల్లగొండ,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అధికారులకు సూచించారు. ఈ సంవత్సరం ఎక్కువ మొక్కలు నాటి వాటిని సంరక్షించిన వారికి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.గ్రామ పంచాయతీ హరిత రక్షణ కమిటీలు బలోపేతం చేసి నూరుశాతం లక్ష్యాలను అధిగమించాలన్నారు. హరితహార కార్యక్రమంలో గ్రామ, మండల, జిల్లాస్‌థ్ధాయి అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, స్వయంసహాయక సంఘాలకు, ప్రజాప్రతినిధులు, యువకులందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. ముందుగా మొక్కలు నాటేందుకు భూములను గుర్తించి గుంతలు తీయించాలన్నారు. మొక్కలు తక్కువగా ఉన్నందున మలబారు, వేప, యూకలీప్టస్‌ మొక్కలను కూడా కోనుగోలు చేసి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గ్రామంలో ఆందుబాటులోన్న ప్రభుత్వ, బంజారుభూములు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. యాదవ, గోల్ల కులాల వారి జీవనోపాధి పెంపొదించి గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గొర్రెలను రిసైక్లింగ్‌ చేయడం, అమ్మడం గాని జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకంటామాన్నారు. ఇందుకోసం పోలీస్‌, రెవెన్యూ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతుబీమా కోసం రైతుల వారీగా భూముల వివరాలు నమోదుచేసి ఏమై నా మిస్‌ అయితే అవి వీఆర్‌ఓలతో సరిచూసుకోవాలన్నారు.

 

తాజావార్తలు