ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ఎలా ఉన్న సంబంధం లేదు
అంతిమంగా విజయం కెసిఆర్‌దే: ఎర్రబెల్లి
జనగామ,డిసెంబర్8(జనంసాక్షి): ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా అంతిమ విజయం తమదే అని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయకార్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో విజయంతో టిఆర్‌ఎస్ మరోమారు ప్రభంజనం సషీ/-టించడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తన విజయానికి సోపానమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నాడి చూసిన తరవాత తమలో మరింత ధీమా పెరిగిందన్నారు. ప్రజలు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనడనికి శుక్రవారం నాటి పోలింగ్ తీరే కారణమన్నారు. సీ ఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను పొందిన నియోజకవర్గంలోని అన్ని వర్గా ల ప్రజలు తనకు ఓటు వేస్తారనే విశ్వాసం ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కృషి చేస్తానన్నారు.



