ఎటిఎంలలో 20 రూపాయిలు

దేశవ్యాప్తంగా ఎటిఎంలలో 20, 50 రూపాయిల నోట్లను ప్రవేశపెడతామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. ఎటిఎంలలో నిరంతరం డబ్బు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంstate-bank-indiaటున్నామని ఆమె అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పని భారం దాదాపు 50 శాతం మేరకు తగ్గిపోయిందని ఆమె చెప్పారు. ప్రజలకు తమ అవసరాలకు తగిన పైకం అందుబాటులో ఉంటుందనే విశ్వాసం కలిగిందని ఇది సూచిస్తోందని ఆమె వివరించారు. ఎటిఎంల వద్ద ప్రజలు బారులు తీరడాన్ని ప్రస్తావిస్తూ 100 రూపాయిల నోట్లు అమర్చడానికి కొంత ఖచ్చితమైన స్థలం ఉంటుందని, కొత్త నోట్ల పరిమాణం మారిందని, ఎటిఎంలలో డబ్బు నిలువ చేయడానికి పరిమితి ఉంటుందని ఆమె అన్నారు. ఇది కొంత ఇబ్బందిని కలుగజేస్తున్నదని ఆమె వివరించారు.