ఎటిఎంల వెక్కిరింపు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  బ్యాంకుల్లో ఎక్కడ చూసినా జనాలు బారులు తీరారు. శని, ఆదివారం సెలవులు కావడంతో మరి ఇబ్బందులు తలెత్తాయి. ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో బ్యాంకుల్లోని ఖాతాదారులు వందల సంఖ్యలో బారులుతీరారు. రెండు వేల రూపాయల కోసం ఖాతాదారులు రెండు గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. పట్టణంలో ఎటు చూసినా ఖాళీ ఏటీఎంలే దర్శనమవుతున్నాయి. ఒక్క పట్టణంలోనే పోటాపోటీగా పలు కంపెనీలు, బ్యాంకర్లు  ఏటీఎంలను అమర్చారు. కాని ఎక్కడ చూసినా డబ్బులు మాత్రం ఉండవు. పెద్ద నోట్ల రద్దు మూలంగా తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంతకుముందు తాము ఇబ్బందులు పడేవాల్లం కాదని ఖాతాదారులు గోడు వెల్లబోసుకున్నారు. తాము చేసేది ఏవిూ లేదని వచ్చే డబ్బులను ప్రతి ఖాతాదారుడికి అందేవిధంగా ప్రయత్నం చేస్తున్నామని బ్యాంకర్లు తెలిపారు.

తాజావార్తలు