ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతాం: కోదండరాం
హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరతామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకుకుని ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ నేతల అరెస్టులను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సాగరహారం పేరిట జరుప తలపెట్టిన తెలంగాణా మార్చ్‌కు అనుమతించాలని కోరుతూ కోదండరాం ఆధ్వర్యంలో పలువురు నేతలు డీజీపీని కలిశారు. అయితే ఈ నెల 30న అనుమతి ఇవ్వటం కుదరదని డీజీపీ చెప్పారని ఐకాస కన్వీనర్ స్వామిగౌడ్ తెలిపారు. వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలిగించమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించమన్నారు.



