*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అప్రమత్తంగా ఉండండి* *దోమ ఎస్సై N. విశ్వజన్*

దోమ న్యూస్ జనం సాక్షి.

భారీ వర్షం కురుస్తూ ఉంటడం వల్ల దోమ మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, కరెంటు ట్రాన్స్ఫరమ్స్, స్తంభాలను ముట్టుకోకుండా చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి, పాడుపడ్డ ఇండ్లల్లో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి,  గ్రామాలకు వెళ్ళే రోడ్లు గాని, రహదారులు గాని, పొలాలకి వెళ్ళే బాటాలుగాని కొట్టుకో పోయే అవకాశం ఉంది. కావున ఏదైనా ప్రాంతం లో రోడ్లు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థిది ఏర్పడితే పోలీస్ అధికారులకు తెలపాలి. చెరువులు, కుంటలు, వాగులు నీటితో నిండి ఉప్పొంగుతుంటాయి, వాగులు ప్రమాద స్థాయిలో పరుగులు పెడుతున్న సమయం లో ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. పాడు పడ్డ బావులు, చుట్టూ కంచె లేని బావుల దగ్గర జాగ్రతగా ఉండాలి. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే ప్రజలు తమ పరిధి లోని పోలీస్ స్టేషన్ అధికారులకు గాని  డైల్ 100 కు గాని ఫిర్యాదు చేయాలి. వర్షం నీటితో రోడ్లు పూర్తిగా తడిసి ఉంటాయి కావున వాహనాలు రోడ్ల పైన జారీ వాహనాలు ప్రమాదలకు గురి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కావున వాహనదారులు నెమ్మదిగా తమ గమ్యాలను చేరుకొని ప్రమాధాలను నిరోధించాలి. అలాగే మాకు మండల ప్రజలు అందరు సహకరించాలని కోరుకుంటున్నాము.!