ఎడారి బతుకుల్లో ఒయాసిస్‌

విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌లో ఇరుక్కుపోయినవారు
3వ తేదీలోపు దరఖాస్తు చేయండి
ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామం
మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెటల్స్‌ లో నిబందనలకు విరుద్దంగా ఉన్న ప్రవాసాంద్రులు రాష్టాన్రికి రావడానికి ఆదేశం ప్రకటించిన అమ్నిస్టే ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌ఆర్‌ ఐ ఎఫేర్స్‌ శాఖామంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. ఈ ప్రోగ్రాం క్రింద ఆదేశంలో చిక్కుకు పోయినవారికి తిరిగి తీసుకురావడానికి ఈనెల 4వతేది చివరి తేదిఅని అయితే 3వతేదీ సాయంత్రంలో నిబంధనలకు విరుద్దంగా ఉన్నవారు భారత రాయభారం కార్యాలయంలో పూర్తి వివరాలతొ ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. శనివారం సచివాలయంలో విూడియాతో మాట్లాడుతూ వీరిలో అర్హులైన వారిని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని చెప్పారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఖర్చులతో వారి స్వగ్రామానికి చేర్చుతుందని చెప్పారు. వీరికి సహాయం అందిండానికి ఆదేశంలో రాయబార కార్యాలయంలో తో పాటు పలు స్వచ్చం దసం స్థలు, ఎన్‌. ఆర్‌. ఐలు సహాక సహకారాలు అందిస్తున్నారని వారి సహాయం ¬దాలని సూచించారు. వీసాలు ముగిసిపోయి, బ్రోకర్ల మోసాలకు యువకులు, మహిళలు , వృద్దులు ,పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి వారి కోసం ఆదేశ ప్రభుత్వం ఆమ్నిస్టే ప్రోగ్రాంను చేపట్టినట్లు చెప్పారు. వీరందరి విరాలు సేకరించి 15రోజుల్లో వారిలో అర్హులైన వారిని తీసుకువస్తామని చెప్పారు. ఇలా విదేశాలనుండి వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాల ద్వారా ఉపాధి కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మొదట రాజీవ్‌ యువశక్తి ద్వారా ఉపాధి కల్పించాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ పథకాన్ని మరో రెండు నెలలు పెంచాలని ఆదేశాన్ని కోరాలని కేంద్ర మంత్రి వాయిలార్‌ రవిని సీఎం కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో కరీంనగర్‌, కడప, పశ్చిమగోదావరి, నిజామాబాద్‌, వరంగల్‌ తదితర జిల్లాల నుండి ఆదేశానికి వలస వెళ్లిన వారు అధికంగా ఉన్నట్లు చెప్పారు. అంతే కాకుండా గల్ఫ్‌ దేశాలలో కూడా నిబందనలకు విరుద్దంగా ఉన్న వారి గూర్చి అద్యయనం చేయడానికి త్వరలో అఖిలపక్షాన్ని పంపే యోచనలో ఉన్నట్లు చెప్పారు.