ఎడ్యుకేషన్‌ హబ్‌గా గజ్వెల్‌ అభివృద్ది

సర్కార్‌ బడులనే ఉపయోగించుకోవాలి: ఎంఇవో
గజ్వెల్‌,మే31(జ‌నం సాక్షి): గజ్వేల్‌ పట్టణంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎడ్యుకేషన్‌హబ్‌ నిర్మాణం చేపట్టింది. సిఎం కెసిఆర్‌ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ సకల హంగులతో విద్యాలయాలు రూపుదిద్దుకున్నాయి. ఈ మేరకు గజ్వేల్‌ ప్రాంత విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో సునీత అన్నారు. అలాగే విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలు శుక్రవారం తెరువనున్నారు. పాఠశాలలు తెరిచే నాటికి పిల్లలకు పుస్తకాలు అందుబాటులో ఉంచి తెరిచిన రోజే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆ దిశగా మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం ఈ సంవత్సరం ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం  పూర్తయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొండపాక మండలంలో ని 40 ప్రాథమిక, 3ప్రాథమికోన్నత, 14 ఉన్నత, ఒక కేజీవీబీ, ఒ క మోడల్‌, ఒకటి గురుకుల పాఠశాలలు మొత్తం 60 ప్రభుత్వ పా ఠశాలల్లో చదివే 5,052 మంది విద్యార్థులు ఉన్నారు. 28,405 పుస్తకాలు అవసరం ఉం డగా ఇప్పటికే 20,600 పుస్తకాలు రాగా వాటిని పంపిణీ చేసినట్లు ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మిగతా పుస్తకాలు పాఠశాల ప్రారంభం లోపే పంపిణీ చేస్తామన్నారు. గౌరారం గ్రామంలో సోమవారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ గ్రామంలో బడి ఈడు గల పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడమే ధ్యేయంగా ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. అలాగే ప్రైవేట్‌ విద్యా సంస్థలకంటే ప్రభుత్వ పాఠశాలలోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తు చేశారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, బట్టలు, సన్నబియ్యంతో కూడిన రుచికరమైన వంటకాలు ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న వరాలన్నారు.