ఎన్జీ రంగ వర్శిటీలో తెలంగాణకు అన్యాయం
వీసిగా ఆంధ్రాకు చెందిన పద్మరాజు నియామకం
వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన
ఉత్తర్వుల నిలిపివేత
హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి): ఎన్జీరంగా అగ్రికల్చర్ వర్సిటీలో తెలం గాణకు మళ్లీ అన్యాయం జరిగింది.తెలంగాణకు చెందిన వ్యక్తినే వీసీగా నియమించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా సర్కారు పట్టించు కోలేదు..గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణకు జరుగుతున్న వివక్ష ఈసారికూడా కొనసాగింది. తాజాగా ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా డాక్టర్ ఎ.పద్మరాజు నియమిస్తూ గురువారంఆయన నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వర్శిటీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే విసిగా నియమించాలని విద్యార్థులు, తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మరాజు నియామకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు గురువారం సైతం ఆందోళన చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు. పద్మరాజు బాధ్యతలు చేపట్టవద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంత తగ్గిన సర్కారు నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.