ఎన్నాళ్ళని కుటుంబ పాలనలో నలిగిపోదాం..

ఈ గడ్డపై రాజ్యాధికారం సాధించుకోవడమే మన జెండా,ఎజెండా….
 – నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్..
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 18 (జనంసాక్షి):-  గద్వాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, పేద వర్గాలకు అభ్యున్నతి, సంక్షేమము అందాలన్నా , రాబోయే మన తరాల అభివృద్ధి కై విద్యాభివృద్ధి కావలన్నా ఈ నియోజకవర్గంను  ఒక కుటుంబ పాలన నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉందని దానికై మనమందరం కంకణ బద్ధులమై మన జెండా, ఎజెండా ఒక్కటై రాజ్యాధికారాన్ని సాధించేవరకు  పోరాడాలని ఈరోజు పట్టణంలోని ఇండియన్ ఫంక్షన్ హాల్ నందు నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ, మండల, మరియు జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు…నియోజకవర్గము ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా ఆయా పార్టీలు ఒక్కసారి తప్ప బడుగు వర్గాలకు టికెట్లు ఇవ్వకుండా కేవలం ఒకే కుటుంబానికి ఇస్తున్నాయని ఈ సంస్కృతి మారాలంటే, పార్టీలకతీతంగా మన యొక్క ఆకాంక్ష బలంగా చాటి చెప్పాలంటే పార్టీలు బీఫాములు ఇవ్వకపోయినా నడిగడ్డలో మన జెండాను ఎగురవేయ్యాలని అన్నారు.  మన ఆశయాన్ని గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి చేరావేయాల్సిన బాధ్యత మనందరి పై ఉన్నదని, రాబోయే ఎన్నికలలో ఆత్మగౌరవానికి, ఆదిపత్యానికి మధ్య పోరాటమని మనమందరం ఆత్మగౌరవం వైపు నిలబడాలని అన్నారు. ఇక్కడి పాలకులు మనల్ని డబ్బుతో ,పార్టీల బీఫాములతో ముడిపెడుతూ మనల్ని అధికారానికి దూరం పెడుతున్నారని ఈ కుట్రలని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. అక్రమంగా సంపాదించినతో, అవినీతి డబ్బుతో ఓటుకు విలువ గట్టి కొంటూ తిరిగి ఓటర్ నే అవినీతిపరుడు అంటూ వక్ర భాష్యం చెబుతున్నారని అలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ఓటు అనే ఆయుధం తో రాజ్యాధికారాన్ని సాధించాలని నూటికి 93% ఉన్న మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం సాధ్యమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు,రేణుక,సాహితి జిల్లా కార్యదర్శి లవన్న, మల్లకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి ఉలిగేపల్లి తిమ్మప్ప లక్ష్మన్న, ఉప్పరి కృష్ణ, మీసాల కిష్టన్న, కృష్ణ గుండన్న,బలిజరాజు, ఆశన్న, నేతన్న, ధరూర్ మండల సమన్వయకర్తలు పరశురాముడు, గోవిందు మునెప్ప, కేటీ దొడ్డి మండల సమన్వయకర్తలు అంజి భీమన్న గౌడ్, ఏసు, రామాంజనేయులు, వెంకటేశ్, జగదీష్, గట్టు మండల సమన్వయకర్తలు బలరాం, ఆలూరు వెంకట్రాములు, దయాకర్,నరేష్, ఉలిగెప్ప, కర్రెప్ప లతోపాటు ముఖ్య నాయకుల సతీమణులు, మహిళలు గ్రామ,మండలాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.