ఎన్నికలు ఎప్పుడయినా విజయం కెసిఆర్‌దే: ఎమ్మెల్యే
సంగారెడ్డి,ఆగస్ట్25(జనం సాక్షి): ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. టిఆర్‌ఎస్ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ది పథకాలు నాలుగున్నరేళ్లలో చేసి చూపిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. ఎన్నికలతో సబంధం లేకుండా కార్యక్రమాలు చేసి చూపిస్తున్నామని అన్నారు. పేదలకు వరంగా మారిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లనుడిసెంబర్‌లోగా అర్హులందరికీ నిర్మించి ఇస్తామని చింతా ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పథకం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుందని ఇది దేశానికే ఆదర్శం అన్నారు. ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా అర్హులందరకీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందుతాయన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి 1,400 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి రూ. 76కోట్ల 75లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయని తెలిపారు. ఈ డబుల్ బెండ్ రూం ఇండ్లను రెండు విడుతల్లో పూర్తి చేస్తామని మొదటి విడుతలో 400ఇండ్లు, రెండో విడుతలో 1,000ఇండ్లు పూర్తవుతాయన్నారు. ఈ ఇండ్ల నిర్మాణం ఆర్‌అండ్‌బీ శాఖ నేతృత్వంలో సత్వరంగా పనులు జరుగుందని తెలిపారు. డబుల్‌బెడ్ రూంల నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా చేపట్టిన స్కీం అని వివరించారు. గత పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవంతో డబుల్ బెడ్‌రూంలో హాల్, బెడ్‌రూం, వంటగది, బాత్‌రూంలతో సహా కనీస వసతులలో నిర్మింస్తుందని తెలిపారు. పసల్‌వాదీలో 325ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. 1400 ఇండ్లకు అన్ని సౌకర్యా లు ఏర్పాటు చేసే విధంగా చూడాలని సంబంధితఅధికారులకు సూచించారు.



