ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీజేఎస్ సిద్ధం
– మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నాడు
– టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
నల్గొండ, జూన్25(జనం సాక్షి ) : ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు వెకిలి, పిల్ల చేష్టలుగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అభివర్ణించారు. సోమవారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడుతూ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీజేఎస్ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. విభజన హావిూలపై రెండు రాష్ట్రాల నేతలు కలిసి పనిచేయాలని కోదండరాం సూచించారు. సామాజిక న్యాయమై లక్ష్యంగా మెరుగైన అభివృద్ధే లక్ష్యంగా జనసమితి పార్టీని స్థాపించడం జరిగిందని, అందుకు అనుగునణంగా జనసమితి పార్టీ సభ్యులు పనిచేస్తారని కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకూ ప్రజాస్వామ్యం అడుగంటి పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన కోదండరాం, డబ్బు సంపాదించుకోవానికే రాజకీయాలను సోపానాలుగా వినియోగించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించానని, టీజేఎస్‌లో చేరేందుకు ఉద్యమ కారులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది దరఖాస్తులు సైతం చేసుకున్నారని తెలిపారు. తెరాసపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని అన్నారు. టీజేఎస్ పార్టీ తరుపున దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి నిలుపుతామని, ప్రభుత్వ వ్యరేతికను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్రాబివృద్ధికోసం టీజేఎస్ ఏ విధంగా ముందుకు సాగుతుందో ప్రజలకు వివరిస్తామన్నారు. వేములకొండ మృతులకు ఇస్తున్న ఎక్సగ్రేషియా కూరగాయల బేరంలా ఉందని కోదండరాం అన్నారు. ఎక్స్ గ్రేషియా విషయంలో ఆదివారం మంత్రి వెటకారపు మాటలు సమంజసంగా లేవని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యంగ్యంగా 50 లక్షలు కావాలా? అని వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని కోదండరాం అన్నారు. ఎక్సగ్రేషియా విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా కనీసం 6 లక్షలైనా ప్రమాణంగా తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.