ఎన్నికలు మీరు నిర్వహిస్తారా?..మేం జోక్యం చేసుకోవాలా:హైకోర్టు

 ivu9ixihహైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఆలస్యంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా? లేక మేం జోక్యం చేసుకోవాలా.. అంటూ కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వార్డుల విభజనపై టీ.ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చింది. వార్డుల పునర్విభజన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 45 రోజుల సమయం కావాలని టీ.ప్రభుత్వం కోర్టును కోరింది. దీంతో ప్రతిసారి గడువు కోరటం సబబు కాదని కోర్టు హితువు పలికింది. అటు… జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.