ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం: కొండా సురేఖ

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధికరాంలోకి రావడం ఖాయమని, తెలంగాణఱ దొరల పెత్తనానికి చరమగీతం పాడబోతున్నామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్‌ గెలుపుతో టిఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ దొరతనాన్ని సహించరని అన్నారు. సంగెం మండలంలోని ఎల్లూర్‌స్టేషన్‌, గాంధీనగర్‌ గ్రామాలకు చెందిన పలువురు తాజా సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ సీనియర్లు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. నియంత కేసీఆర్‌, ఆయన కుటుంబ పాలనలో పని చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లో పేర్కొన్న మేనిఫెస్టో అంశాలను తుంగలో తొక్కిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని ర్తిగా అప్పుల్లో ముంచిందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల రవీందర్‌గౌడ్‌, నాయకులు జనగాం రమేష్‌, వేల్పుల కుమారస్వామియాదవ్‌, కక్కెర్ల సంతోష్‌, బ్రహ్మయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. ఇదిలావుంటే ధనికుల కొమ్ముకాస్తున్న తెరాస సర్కార్‌ను వచ్చే ఎన్నికల్లో అంతమొందించాలని నరంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే పేదలందరికి రెండు పడక గదులు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పి ఓట్లు దండుకుని గ్దదెనెక్కిన తరువాత ఒక్క హావిూని నెరవేర్చలేదన్నారు. తెరాస నేతలు పూటకో మాట రోజుకో వేషం చొప్పున మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు చెందిన రూ.2లక్షల దాకా పంట రుణాలను ఏకకాలంలో రద్దు చేస్తామని, పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తామని ఇందిరమ్మ ఇళ్ల బకాయి బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ప్రజలు అధికార పార్టీ నాయకులు నిలకడలేని మాటలు విని మోసపోవద్దన్నారు.

తాజావార్తలు