*ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు* జిల్లా కలెక్టర్

నల్గొండ బ్యూరో,జనం సాక్షి .
మునుగోడు ఉప ఎన్నిక   కు సంబంధించి    నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో   ప్రత్యేక కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. దీని కోసం ప్రత్యేక  టెలిఫోన్ నెంబరు 08682 230198 ను ఏర్పాటు చేసినట్లు,  మునుగోడు ఉప ఎన్నికల్లో ఏవైనా డబ్బుల పంపిణీ జరిగినను, మద్యం పంపిణీ జరిగిన గానీ, లేదా ఇతరత్రా ప్రలోభాలకు గురి చేసినా గానీ, లేదా ఓటు వేయకుండా నిరోధించినను, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన గానీ లేదా రాత్రి 10 గంటల తరువాత ప్రచారం చేయటం, అనుమతి లేకుండా గోడలకు రాతలు రాయటం వంటి ఎన్నికల నియమావళి  ఉల్లంఘనలు జరిగిన చో జిల్లా కంట్రోల్ రూం కు ప్రజలు పిర్యాదు చేయవచ్చు అని ఒక ప్రకటన లో తెలిపారు.  పిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఈ కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుందని, కావున   ఉప ఎన్నిక సంబందించి ఏమైనా   పిర్యాదులు ఉంటే పై నంబర్ కు ఫోన్ చేసి తెలియపరచ వచ్చని,పిర్యాదులు నమోదు చేసుకుని సంబంధిత అధికారులు విచారించి తగు చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.