ఎన్నికల ప్రచార వ్యయాన్ని నిశితం గా పరిశీలించాలి

 ఎన్నికల వ్యయ పరిశీలకురాలు
 నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,అక్టోబర్ 13. మును గోడు  అసెంబ్లీ నియోజవర్గ ఉప ఎన్నిక లో అభ్యర్థుల ఎన్నికల ప్రచార  వ్యయం నిశితంగా పరిశీలించాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ముళ్ళ పూడి సమత అన్నారు.గురువారం మునుగోడ్, చండూర్ మండలం లలో ఆమె పర్యటించారు.ముందుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన అకౌంటింగ్ టీమ్,వి.వి.టి.టీమ్ లు పని తీరును,వి.వి.టి.రికార్డ్ చేసిన వీడియో లను పరిశీలించారు. ఎన్నికల వ్యయం,ప్రచార ఖర్చుల నమోదు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంత రం చండూర్ మండలం ఉడతలపల్లి,మును గోడ్ మండలం గూడా పూర్ లో ఏర్పాటు చేసిన ఎస్.ఎస్.టి.టీమ్ ల ను పరిశీలించి సూచనలు చేశారు.వాహనాలు తనిఖీ చేసేప్పుడు వాహనం నంబర్,తేదీ సమయం తో పాటు,వాహనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతోంది వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు.ఎవరైనా ఎన్నికల సంబందించి పిర్యాదు లు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ టోల్ ప్రీ నంబర్  1800 425 1442 నంబర్ కు,చండూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన 08681 268002 నంబర్ కు తెలుపాలని,లేదా  తన నంబర్ 9391876991 కు ఫోన్ చేయవచ్చని ఆమె సూచించారు.ఆమె వెంట  సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు సురేష్ నాయక్  ఉన్నారు
Attachments area