ఎన్నికల వ్యయ పరిశీలకురాలు విస్తృత తనిఖీలు.

 నల్గొండ బ్యూరో, జనం సాక్షి . మును గోడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో అభ్యర్థులు మద్యం,డబ్బు పంపిణీ,వస్తువులు పంపిణీ తో ప్రలోభ పరచకుండా గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ముళ్ళ పూడి సమత అన్నారు.  శనివారం ఆమె సాయంత్రం నుండి రాత్రి వరకు మును గోడ్,నారాయణ పూర్,గట్టుప్పల్ మండలం లలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.             ఉప ఎన్నిక సందర్భంగా మోడల్ కొడ్ అమలు,ఎస్.ఎస్.టి.టీమ్ లను ,వైన్ షాప్ లను తనిఖీ నిర్వహించారు మును గోడ్ మండలం సింగారం,కచలా పురం,పలివెల, నారాయణ పూర్ మండలం సర్వేల్ గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను గమనించారు. కఛలా పురం లో ఎస్.ఎస్.టి టీమ్ పరిశీలించి,వాహనాలు రాక పోకలు రికార్డ్ చేయుటకు అక్కడ సి.సి.కెమెరాలు ఏర్పాటు చేశారు . సర్వేల్ గ్రామం లో ఎస్.వి.వైన్ షాపు తనిఖీ నిర్వహించి మద్యం అమ్మకాలు పరిశీలించారు పండుగ తర్వాత నుండి రోజూ వారీ అమ్మకాలు పెరిగి నట్టు ఆమె గమనించారు.తర్వాత నారాయణ పూర్ లో ఎస్.వి.వైన్ షాప్,గట్టు ప్పల్ లో శ్రీనివాస వైన్ షాప్ లలో మద్యం అమ్మకాలు పరిశీలించారు .దసరా పండుగ తర్వాత రోజూ వారీ అమ్మకాలు పెరిగినట్టు ఆమె తెలుసుకున్నారు.ఆమె వెంట సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు సురేష్ తదితరులు ఉన్నారు