ఎన్నెస్పీ కెనాల్‌లో విద్యార్థి మృతదేహం లభ్యం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం దగ్గర ఎన్నెస్పీ కెనాల్‌లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ విద్యార్థి మణిదీప్‌గా గుర్తించారు. మెడికల్ విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, పోలీసులు విచారణ జరుపుతున్నారు.