ఎన్ కౌంటర్ లో ఇద్దరు దుండగులు హతం
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండుగుల కాల్పుల్లో నాగురాజు అనే కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్ఐ సిద్దిఖీ, సీఐ గంగిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులుగా భావిస్తున్నారు.