ఎపికి ఇచ్చిన ప్రత్యేక హావిూలు అమలుకావాల్సిందే
ఆక్వాతో కనుమరుగు కానున్న డెల్టా: సిపిఎం
ఏలూరు,జూన్4(జనం సాక్షి): కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు ఎన్నికల హావిూలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమయ్యా యని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ విమర్శించారు. నరేంద్రమోడీ, చంద్రబాబు మన రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక¬దా కల్పించడానికి కృషిచేస్తామని ఇచ్చిన ఎన్నికల హావిూని మరచిపోయారని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏడు జిల్లాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హావిూ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక ¬దా కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రపంచ పర్యటన చేసి విశాఖలో ఆర్భాటపు ఈవెంట్లను నిర్వహించారని వీటివల్ల ఎవరికిమేలుచేశారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించడమంటే నిర్మాణానికి మాత్రమే నిధులు కేటాయించి విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణం, తదితర పనులను విస్మరించడం కాదని విమర్శించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తిచేయాలని, ప్రత్యేక¬దా ఇచ్చితీరాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక¬దా సాధన కోసం వామపక్షాలు జరిపే న్యాయపోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఇదిలావుంటే .పొలాలన్నీ చేపల చెరువులుగా మారిపోతుండటం ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ఆక్వా పరిశ్రమల పేరుతో కాలుష్యం వెదజల్లుతున్నారు. ప్రజలంతా ఎదురొడ్డి నిలబడితేనే ఉన్న భూములనైనా కాపాడుకునే అవకాశం ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు. సారవంతమైన భూములను ఎందుకూపనికిరానివిగా చిత్రీకరించి వ్యవసాయాధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం అత్యంత దారుణమన్నారు. డెల్టాను పరిరక్షించాలని మొసలి కన్నీరు కారుస్తూ మరోపక్క కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పశ్చిమ డెల్టాలో పంట పొలాలకు ముప్పు ఏర్పడిందని అన్నారు. ముందస్తు ప్రణాళికతోనే విచ్చలవిడిగా ఆక్వా చెరువుల తవ్వకాలు సాగించి విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. భీమవరాన్ని ఆక్వాహబ్‌గా మారుస్తానంటూ సిఎం చంద్రబాబు చేసిన ప్రకటన డెల్టాను సర్వనాశనం చేసేదిగా ఉందన్నారు. 50 నుంచి 60 బస్తాలు దిగుబడి వస్తున్న రెండు పంటలు పండే పొలాలను నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులుగా మార్చడం దారుణమన్నారు. డెల్టాలో ఆరు లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఇప్పటికే సగం భూమిని ప్రభుత్వం చేపల చెరువులుగా మార్చేసిందన్నారు. మరో ఏడాదికి మిగిలిన పంట భూములను సైతం చెరువులుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. చేపల చెరు వుల అక్రమ తవ్వకాలతో వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఉపాధి కోల్పోయారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే డెల్టా కనుమరుగ వుతుందన్నారు. ఇదిలావుంటే