ఎపిలో పెరిగిన ఎండల తీవ్రత

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
అమరావతి,మే4(జ‌నంసాక్షి): ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 76 మండలాల్లో 43 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి, చింతూరులో అత్యధికంగా 44.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమలో వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఎపి లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆర్‌టిజిఎస్‌ తెలిపింది. వృద్ధులు, చిన్న పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో… 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్‌టిజిఎస్‌ వెల్లడించింది.