ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం :సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ తీర్మాణానానికైనా మద్దతిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. చిల్లర వర్తకం, బీమా, పింఛన్లు లాంటి రంగాల్లో ఎఫ్‌డీఐలకు తాము వ్యతిరేకమని అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎఫ్‌డీఐపై ప్రతిపక్షాలు పార్లమెంటులో తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. కేజ్రీవాల్ వ్యక్తులపై తాము సంస్థలపై పోరాడతామని చెప్పారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పాలవుతుందని అన్నారు.