ఎఫ్‌సీఐ కార్యాలయంలో సీబీఐ విచారణ

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో శుక్రవారం సీబీఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎఫ్‌సీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సోమయ్య ఇటీవలి కాలంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో సీబీఐ అధికారులు ఎఫ్‌సీఐలో విచారణ చేపట్టారు. సీబీఐ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.