ఎఫ్‌ డి ఐపై ప్రాధాని వాదన తప్పు :అన్నా

పనాజి: ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసమే విధేశీ కంపెనిలను ఆహ్వానిస్తున్నామని ప్రధాని మన్మోహాన్‌సింగ్‌ చేస్తున్న వాదనను సామాజిక కార్యకర్త అన్నా సహజారే తప్పుబట్టారు. గోవాలోని పనాజిలో జరిగిన ఓ సదస్సులో మాట్లడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొదట ఆభివృద్ది చేయాలన్న మహాత్మగాంధీ భావనను గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. విదేశికంపెనీలను ఆహ్వానించి, వాటికి భూమిని,ఖనిజాను అప్పజెప్పడం సరికాదని వాఖ్యానించారు.

తాను కూడ పలు గ్రామాలలో విదేశీ నిధులేమీ లేకుండానే కృషి చేసి మార్పు తీసుకువచ్చామని  ఆన్నా చెప్పారు.ఆ గ్రామాలలో ఆప్పుడు ఆకలితో మాడినవారు, ఇప్పుడు కూరగాయలు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. కేవలం ఆవినీతి  ఒక్కటే కాదని,మానవహాక్కులు, పర్యావారణం కూడా ఎదుర్కోవాల్సిఉందని అన్నారు తనకు బిజెపి,ఆర్‌ ఎస్‌ఎస్‌లతో అనుబంధం ఉందన్న ఆరోపణలపై స్పందిచిస్తూ, ఇవి కొత్త కాదని, పళ్లు  ఉన్న చెట్టుకే రాళ్లు ఎక్కువ  తగులుతాయి వ్యాఖ్యనించారు, ఎవరేమన్నా తన మార్గంలో తాను వెళతానని చెప్పారు.