ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలలు బంద్

దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ దారుణ హత్యను  తీవ్రంగా ఖండిస్తూ విద్యా సంస్థలు బంద్
జనం సాక్షి న్యూస్ : ఉప్పునుంతల:23-ఆగస్టు 2022 నాగర్ కర్నూల్ జిల్లా
ఉప్పునుంతల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాజస్థాన్ లో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వల్ మృతికి నిరాసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థలు సంపూర్ణంగా బంద్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ ఏడెల్లి అంజి మాదిగ మాట్లాడుతూ కుల దురహంకారాలకు వారికి పత్తసు పలికే పాలకవర్గాలకు చెమటలు పట్టేలా విద్యార్థి లోకం ఉద్యమించాలి.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పాలకవర్గాలు వేడుకలు చేసుకుంటున్నా సమయంలో నీళ్లు తాగే స్వేచ్ఛ కూడా లేని దళిత పీడత వర్గాల స్వేచ్ఛ కోసం గౌరవంగా జీవించే హక్కు కోసం ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. పాఠశాలలో ఉన్న కుండలో నీళ్లు తాగినందుకే దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వల్ కిరతంగా ఆ స్కూల్ టీచర్ చేతిలోనే చంపబడ్డాడని విషయం స్పష్టమైన తర్వాత. ఈ సంఘటన జరిగి దాదాపు పది రోజులు అవుతున్నప్పటికీ దళిత వర్గాల ఆ వర్గాల పక్షంలో ఉద్యమించే శక్తులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసినప్పటికీ ఈ దేశ ప్రధాని జరిగిన సంఘటన పట్ల కనీసం విచారణ వ్యక్తం చేయకపోవడం సంఘటనను ఖండించకపోవడం మరెక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగవద్దని మాట్లాడకపోవడం కుల వ్యవస్థ ఆధారంగా దేశంలో కొనసాగుతున్న సాంఘిక అసమానతలను రూపుమాపడం తన కర్తవ్యాన్ని ప్రధాని మాట్లాడకపోవడం చూస్తే ఈ దేశంలో కోట్లాది మంది దళిత వర్గాలకు పీడిత వర్గాలకు గౌరవంగా జీవించే హక్కును పరిరక్షించే బాధ్యతను కేంద్రం పూర్తిగా విస్మరించినట్లేనని  రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో వివేక్షతకు దాడులకు నిత్యం హత్యలు అత్యాచారాలకు గురవుతున్న దళిత పీడిత వర్గాల మనం గట్టిగా నిలబడి పోరాడాల్సిన బాధ్యత మనదే అనేదే ముమ్మాటికి వాస్తవం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ తాలూకా ఇంఛార్జి చిట్టిగొరి పవన్ కళ్యాణ్ ఎం ఎస్ ఎఫ్ నాయకులు రాంబాబు శ్రీకాంత్ రామకృష్ణ  ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొమ్ము రాంప్రసాద్ ఎమ్మార్పీఎస్ నాయకులు లింగమయ్య శివ శంకర్ పాల్గొన్నారు

 

On Sun, Jun 19, 2022, 4:04 PM seyed jani miya <[email protected]> wrote:
రేషన్ కార్డు మార్పు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనం సాక్షి న్యూస్ ఉప్పునుంతల:
రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది రేషన్ కార్డులో ఏవైనా మార్పులు అంటే పేర్లను తొలగించడం లేదా జతపరచడం
లాంటి వాటిపై కీలక ప్రకటన చేసింది రేషన్ కార్డు కలిగి ఉండి అందులో పూర్తి కుటుంబ పేర్లు లేకపోవడం ఉదాహరణ కు కొత్తగా వివాహమై వారి భార్య పేరు లేకపోవడం లేదా ఇటీవలే పుట్టిన చిన్న పిల్లలు వారి పేర్లను నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి కావలసిన ధ్రువ పత్రాలు(1) పాత  లేదా కొత్త రేషన్ కార్డు నెంబర్ (2) రేషన్ కార్డులో నమోదు చేయవలసిన వారి ఆధార్ కార్డు (3) గ్యాస్ కనెక్షన్ బుక్ నమోదు చూసుకో దలచినవారు మీసేవ కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది