ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లాలో బంద్ విజయవంతం

గద్వాల నడిగడ్డ,ఆగస్టు 23 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రంలో పాటు వివిధ ప్రవేటు,ప్రభుత్వ విద్యా సంస్థల బంద్ మంగళవారము విజయవంతంగా ముగిశాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని జల్లూరు జిల్లా సూరానా గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ దాహం వేస్తుందని స్కూల్లో ఉన్న కుండలోనీ నీళ్లను త్రాగడని విద్యార్థిని చావగొట్టిన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మేరకు జోగులంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి,రాజోలి మండల కేంద్రంలో గ్రామాల్లో విద్య సంస్థలు బంద్ చేయడం జరిగిందనీ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుల కొంకల భీమన్న అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజోలి భాస్కర్ మాదిగ,మండల అధ్యక్షుడు కృష్ణకాంత్ మాదిగ,ధనుంజయ్ మాదిగ,ఏసేపు మాదిగ, సీనియర్ నాయకులు మధు మాదిగ,ఎం ఎస్ ఎఫ్ మండల నాయకులు రాజశేఖర్,
ప్రభాకర్,రవి,కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి దేవేందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు