ఎమ్మార్పీఎస్* దీక్షకు సంఘీభావం తెలిపిన మండల కాంగ్రెస్నాయకులు
పెగడపల్లి తేది 08( జనంసాక్షి )
పెగడపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు దీకొండ మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్ష లో భాగంగా కేంద్రం లో ఉన్న బీజేపీ పార్లమెంట్ లో ఎస్సి ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కొనసాగుతున్న నిరసన దీక్షకు పెగడపల్లి మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్,మండల శాఖ నాయకులు సంఘీభావం తెలిపి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఇవ్వకుండా మాధిగ (మాదిగ ఉపకులాల) ను వంచిస్తున్న బిజెపిని బొందపెట్టాలని వర్గీకరణకు కాంగ్రెస్ అధినాయకత్వం సుముఖంగా ఉందని అన్నారు ఈ దీక్షకు సంఘీభావం తెలిపైన వారిలో కాంగ్రెస్
ఉపాధ్యక్షులు సంధిమల్లారెడ్డి,బండారిశ్రీనివాస్,తడగొండరాజుమండల నాయకులు తడగొండ తిరుపతి, మండల సోషియల్ మీడియా ఆర్గనైజర్ చంద్రశేఖర్ గౌడ్.ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు శ్రీరాం అంజయ్య,బొమ్మేన దయాకర్,మండల నాయకులు గసికంటి గోపాల్,కొత్తూరి రవికుమార్,అంజి,గంగాధర్
తదితరులు పాల్గొన్నారు