ఎమ్మెల్యేకు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు
రంగారెడ్డి,మే16(జనం సాక్షి): చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన వేడుకలు ఘనంగ ఆనిర్వహించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్ రెడ్డి. కేక్ కట్ చేసి, తినిపించి ,బోకే ఇచ్చిఎంఎల్ఏ యాదయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంఎల్ఏ యాదయ్య కు పంపిన జన్మదిన శుభాకాంక్షల బోకేను, సందేశాన్ని మంత్రి అందించారు. వెనకబడిన తెలంగాణ సమాజం, చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం యాదయ్య చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు.