ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్‌

చేగుంట: చెట్టు పట్టా పథకంలో భాగంగా చేగుంట మండలం వడ్యారంలో జిల్లా కలెక్టరు దినకర్‌బాబు ఎమ్మెల్యే ముత్యంరెడ్డితో మొక్కలు నాటారు. పదేళ్లకు ఫలసాయాన్ని అందించే సీతాఫలం, ఈత చెట్లతో పాటు మల్లెమొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ చెట్టుపట్టా పథకం రాష్ట్రంలో మొదటిసారిగా దుబ్బాక నియోజకవర్గంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వీటినుంచి వచ్చే ఫలసాయాన్ని అందుకుని ప్రజలు లాభపడే అవకాశముంటుందన్నారు.