ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరించరా?
మెదక్,జూన్11(జనం సాక్షి): హైకోర్టు తీర్పు ఇచ్చినా ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోక పోవడం కోర్టులంటే ఖాతరు చేయకపోవడమేనని మెదక్ మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్ రెడ్డి అన్నారు. తీర్పు వచ్చి 50 రోజులైనా స్పీకర్ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వ పునరుద్ధరణ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ దృష్టికి తమ నేతలు తీసుకెళ్లారని తెలిపారు. చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని అన్నారు. కోర్టు తీర్పు అమలు చేసి స్పీకర్ హుందాగా వ్యవహరించాలని తెలిపారు. సంపత్, వెంకటరెడ్డి సభ్యత్వాలు పునరుద్ధరించాలని తెలిపారు. కోమటిరెడ్డి సంపత్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. . కోర్టు తీర్పు అమలు చేసేందుకు ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారని అన్నారు.