ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలి
టిఆర్‌ఎస్ రౌడీయిజంపై పోరాటం చేస్తాం
బిజెపి నేతలపై దాడులు సరికాదు: రామచందర్ రావు
హైదరాబాద్,ఆగస్ట్17(జనంసాక్షి): గీతానగర్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని సూపరింటెండెంట్ రాజు తెలిపారు. శ్రవణ్‌ను మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, కపిలవాయి దిలీప్‌కుమార్, వివిధ డివిజన్లకు చెందిన భాజపా కార్పొరేటర్లు, జనసేన నేత సతీశ్‌నాయుడు పరామర్శిం చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. పలువురు బిజెపి నేతలు అక్కడికి వెళ్లి పరామర్శించారు. తెరాస రౌడీయిజానికి గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని అన్నారు. దీనిపై విచారణ జరిపి ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు దాడికి నిరసనగా బిజెపి ఇచ్చిన బందు పిలుపు ఉద్రిక్తలకు దారితీసింది. మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో ఆదివారం కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్‌పై దాడికి నిరసనగా సోమవారం భాజపా చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ముందస్తుగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో పాటు 40 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భాజపా నేతలు సర్కిల్ పరిధిలో దుకాణాలను మూసివేయించగా.. వాటిని తెరిపించేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో 50కిపైగా కార్లతో ఆనంద్‌బాగ్ నుంచి విూర్జాలగూడ వరకు ర్యాలీ నిర్వహించారు. బంద్‌లో
భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న భాజపా కార్పొరేటర్లు సునీతాయాదవ్, రాజ్యలక్ష్మి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్, పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నేరేడ్‌మెట్ ఠాణాకు తరలించారు. అదే సమయంలో ఎమ్మెల్యే హన్మంతరావు ర్యాలీ అక్కడికి చేరుకోగా.. ఆయన అనుచరులు భాజపా కార్యకర్తలపై దాడికి దిగారు. సునీతాయాదవ్ కారు, మరో కారు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న అదనపు డీసీపీ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తెరాస శ్రేణులను అడ్డుకొని దాడిని నిలువరించారు. తనతో పాటు తన డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో తిట్టారని, రాళ్లతో దాడి చేశారని మౌలాలి కార్పొరేటర్ సునీతాయాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఫోన్లు, మెడలో
గొలుసులను లాక్కెళ్లారని పలువురు భాజపా నాయకులు పేర్కొన్నారు. సునీతాయాదవ్ ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ సహా సుమారు 20 మందిపై కేసు నమోదు చేశారు. భాజపా శ్రేణులు ఎమ్మెల్యే వాహనశ్రేణిని అడ్డుకొని దాడి చేశారని వినాయక్‌నగర్‌కు చెందిన దూలం మహేశ్‌గౌడ్ ఫిర్యాదు చేయగా.. సునీతాయాదవ్, రాజ్యలక్షి, భానుప్రకాశ్ సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణాళిక ప్రకారం పోలీసులు తమను అరెస్టు చేసి ఠాణాకు తీసుకొచ్చి, ఎమ్మెల్యే అనుచరులతో దాడి చేయించారని భాజపా శ్రేణులు ఆరోపించాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఠాణా ముందు ధర్నా చేపట్టారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితాకృష్ణమూర్తి వారితో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తామని హావిూ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.