ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘనవిజయం
ఆరింటిలోనూ అధికార పార్టీ అభ్యర్థుల హవా
కరీంనగర్‌లో ఎల్. రమణ, భానుప్రసాద్‌ల విజయం
మెదక్‌లో యాదవరెడ్డి,ఖమ్మంలో తాతా మధు గెలుపు
నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్‌లో దండే విఠల్ గెలుపు
హైదరాబాద్,డిసెంబర్14(జనంసాక్షి ): రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. కరీంనగర్‌లో ఎల్.రమణ, భానుప్రసాద రావు విజయం సాధించారు. ఖమ్మంలో తాతా మధు, నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. మెదకలో ఓటేరు యావదరెడ్డి, ఆదిలాబాద్‌లో దండే విఠల్ విజయం సాధించారు. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడిరది. టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిరూపితమైంది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. తాజా ఫలితాల్లో ఆరు సీట్లలోనూ గులాబీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుచోట్ల ఓట్ల లెక్కింపు నిర్వహించారు.ఈ తీర్పు విపక్షాలకు చెంపపెట్టుగా అయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల అంచనాలను తలకిందులు చూస్తూ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలను టిఆర్‌ఎస్ గెల్చుకుంది. తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉందని టిఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. మొత్తం పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో శాసనమండలిలో మిత్రపక్షాలతో కలిసి టీఆర్‌ఎస్ బలం 39కి చేరింది. 36 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఉండగా, ఇద్దరు ఎంఐఎం నుంచి, ఒకరు కాంగ్రెస్, మరొకరు స్వతంత్ర సభ్యుడు శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజా ఫలితాల తరవాత బీజేపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కిపు చేపట్టారు. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు ఎంమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో ఒక్కో సీటు … ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు అభ్యర్థుల సమక్షంలో స్టాంª`రగ్ రూంను ఓపెన్ చేసి, అందులో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ హాల్ కు తరలించారు. అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బ్యాక్సులను ఓపెన్ చేశారు. 25 చొప్పున బండిల్స్ కట్టి, వాటిని టేబుల్స్ విూద ఉంచారు. మొదట ఫస్ట్ ప్రయార్టీ ఓట్లను లెక్కించారు. మొత్తం ఆరు స్థానాల్లోనూ అధికార పార్టీ గెలుపొందడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణ ఇద్దరూ గెలుపొందారు. ఇక్కడ మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లనివి కాగా, 1303 చెల్లుబాటు అయ్యాయి. భానుప్రసాద్‌కు 584 ఓట్లు రాగా, రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థి
గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సవిూప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. మరో స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి. ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్ సవిూప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్కరంపై 666 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 862 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి విట్టల్‌కు మొత్తం 740 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, మొత్తం చెల్లని ఓట్లు 48 నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్‌ఎస్ నుంచి తాతా మధు 247 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. పట్టణంలోని డిస్టిక్ట్ పంచాయతీ రాజ్ కార్యాలయం భవనంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఎమ్మెల్సీ ఓట్లకు గానూ 738 ఓట్ల పోలయ్యాయి. ªుఖా అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 239 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందినట్లు ఈసీ అధికారులు ప్రకటించారు.