ఎమ్మెల్సీ కవితను బద్నాం చేస్తే కబడ్డార్.

తాండూర్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ
తాండూరు అగస్టు24(జనంసాక్షి)ఎమ్మెల్సీ కవిత ను ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరాధార ఆరోపణలతో బద్నాం చేస్తే గట్టిగా బదులిస్తామ ని జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ద్వారా ఎందరినో ఆదుకున్న కవితను రాజకీయంగా ఎదుర్కొనలేక బీజేపీ ఢిల్లీ నాయకులు ఆరోపణలు చేశారని ఒక ప్రకట నలో తెలిపారు.కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్నా, మహనీయురాలు, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బందు వురాలని తెలిపారు.సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయ నాయకులను ప్రశ్నించినందుకు
నీచ రాజకీయలతో ఆడపడుచుపై ఆధారం లేని ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై అక్కసుతో ఢిల్లీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ ఇతర ప్రతిపక్ష నాయకులు నీచరాజకీయాలు మానుకుని అభివృద్ధిపనుల మీద దృష్టి సారించాలని అన్నారు.