ఎయిరిండియా పైలట్ల ఆమరణ దీక్ష
న్యూఢిల్లీ:ఎయిరిండియా పైలట్లు 48రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది.తొలగించిన 101 మంది పైలట్లు విధులోకి తీసుకోవాలని,భారత పైలట్లు సమాఖ్య(ఐపీజీ)కార్మిక సంఘం గుర్తింపును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దక్షకు దిగారు.ఏఐ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న11 మంది ఫైలట్ల బృందం ఆదివారం ఉదయం ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద దీక్ష ప్రారంభించినట్లు ప్రకటించింది.”మేం అన్ని అంశాలను పక్కన పెట్టాం.కేవలం కేవలం తొలగించిన 101 మంది ఫైలట్లను విధుల్లోకి తీసుకోవాలని,ఐపీజీకి గుర్తింపును తిరిగి ఇవ్వాలని మాత్రమె డిమాండ్ చేస్తున్నాం”అని ఆమరణ దీక్షకు నేతృత్వం వహిస్తున్న కెప్టెన్ ఆదిత్యసింగ్ ధిల్లాస్ చెప్పారు.48రోజుల ఆందోళనకు ఆమరణ దీక్షతో పరిష్కారం లభిస్తుందా అన్న ప్రశ్నకు..నాకు తెలియదు.కానీ మాకు ఇంతకు మించి ప్రత్యామ్నాయం లేదు అని ధిల్లాస్ బదుదలిచ్చారు.