ఎరువుల వ్యాపారులపై విజిలెన్స్ దాడులు ఏమయ్యాయి
పెద్దపల్లి, ఆగస్టు 7 (జనంసాక్షి) : ఓ వైపు రైతులు విత్తనాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విజిలెన్సు అధికా రులు నెల క్రితం జిల్లా మొత్తం పురగు మందుల వ్యాపారుల దుఖానాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో స్టాకులను స్వాధీన పర్చుకున్నారు. ఆ స్టాకులు సీజ్ చేసినప్పటి నుంచి వ్యాపారులు జిల్లాలోని రాజకీయ నాయకులతో అధికారులపై ఒత్తిడి తీసుకవ స్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. దాని వల్ల అధికారులు వ్యాపారులతో ఎం తో కొంత తక్కువ మోత్తంలో పెనాల్టీలు కట్టించి ఆ పైల్లను మూసి వేస్తున్నారు. దాని వల్ల వ్యాపా రులు దొరికితే దొంగా లేదంటే తక్కువ పెనాల్టీల తో అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీని వల్ల రైతు లకు సమయానికి సరుకులు దొరకక తీవ్ర ఇబ్బం దుల పాలవుతున్నారు. కానీ అధికారులు మాత్రం నామ మాత్రపు దాడులు నిర్వహిస్తున్నారనే వదం తులు వెలువడుతున్నాయి. రాజకీయ నాయకులు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు సేవ చేయాల్చింది పోయి అవినీతి వ్యాపారులకు వత్తాసు పలుకుతు న్నారు. కచ్చితమైన శిక్షలు పడకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ తంతంగం అంతా ఎప్పటిదో అనుకుంటున్నారా కాదంటి నెల రోజుల క్రితం జరిగిన దాడులలో ఈ విషయాలు బట్టబయల య్యాయని రైతులు అనుకుంటున్నారు. అధికా రులు సీజ్ చేసిన సరుకులను తమ ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ గోదాములలో లేదా అదే గ్రామంలోని వేరే వ్యాపారికి సరుకులను అప్ప గించాలి. అధికారులు మాత్రం దాడులు నిర్వహిం చారు. స్టాకులను మాత్రం సీజ్ చేసిన వ్యాపారుల గోదాములలోనే వుంచారు. దీన్ని బట్టి అధికారుల పనితీరు అర్థంచేసుకోవచ్చునని జిల్లా రైతులు అనుకుంటున్నారు.కొందరు వ్యాపారులు కేసులు నమోదు కాగానే కోర్టులో దావాలు కూడ వేశారు. దాని వల్ల ప్రయోజనాలు కన్పించక పోవడం వల్ల జిల్లాలోని రాజకీయ నాయకులను ఆశ్రయిస్తే తమ పని చాలా సులువుగా అవుతుందని అర్థం చేసుకున్నారు. రాజకీయ నాయకులకు కొందరు వ్యాపారులు తప్పుడు సమాచారాలు ఇచ్చి ఎంతో పెద్ద కేసుల నుంచి అధికారుల పై ఒత్తిడి తెప్పించి తమ పనులను ముగించుకుంటున్నారు.కొందరు జిల్లాలోని వ్యాపారులు తమ కేసులు ముగియక ముందే సీజ్ చేసిన స్టాకులను అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి కేసులు నమోదు చేసిన వ్యాపా రులను గుర్తించి వారికి తగిన శిక్ష వేసి ఇలాంటి వ్యాపారాలు చేయకుండా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు.