*ఎర్రవల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు*

ఇటిక్యాల ఆగస్టు 19 (జనం సాక్షి) శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు రాధా వేషధారణ ధరించి ఆటపాటలాడారు. అనంతరం ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. కృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానిలో భాగంగా ఎర్రవల్లి చౌరస్తాలోని సరస్వతీ స్కూల్లో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని అటువంటి సాంప్రదాయ పండుగలో కృష్ణాష్టమి ఒకటని ఆయన అన్నారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికే  ఇటువంటి కార్యక్రమాలు తెలిపారు. విద్యార్థులకు సాంప్రదాయ పండుగల విలువలు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి రోజున వేషధారణ ధరించిన పిల్లల కార్యక్రమాలు వీక్షకులను రంభింపజేశాయి.  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.