ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎంత వివిప్యాట్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 21 (జనం సాక్షి);

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివిప్యాట్ ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.శుక్రవారం ఐడిఓసి లో ఏర్పాటు చేసిన ఈవిఎం, వివిప్యాట్ అవగాహన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేసుకున్న ఈవీఎం యంత్రాల్లో 10 శాతం యంత్రాలను, వివి ప్యాట్లను సిబ్బంది శిక్షణ, ఓటర్లలో అవగాహన కార్యక్రమాల కొరకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవడం మన జన్మ హక్కు అని, ఈవీఎం యంత్రాలు, వివి ప్యాట్ ల ద్వారా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దాని పై ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు వాహనం ను సిద్ధం చేస్తున్నట్లు, పోలింగ్ కేంద్రం పరిధిలో ఈ వాహనం వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తుందని కలెక్టర్ అన్నారు. ఐడిఓసి, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రిటర్నింగ్ అధికారుల కార్యాలయం పరిధిలో సైతం అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలలో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు,గద్వాల ఆర్ డి ఓ కార్యాలయం,తహసిల్దార్ కార్యాలయం ఆలంపూర్, నందు ప్రజల అవగాహన కొరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం, వివిప్యాట్ వినియోగించుకుని ఓటు ఎలా వేయాలని దానిపై విస్తృత ప్రచారం చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ వరలక్ష్మి, సురేష్ ,రఘు,కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.