ఎల్లారెడ్డిపేటలో దొంగల ఘాతుకం

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో దొంగలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 3 తులాల బంగారు గొలుసు రూ. లక్ష చోరీకి పాల్పడ్డారు. దొంగలను చూసి కేకలు వేసిన వృద్దుడి నాలుకను దొంగలు కోసేసారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దొంగల కోసం గాలిస్తున్నారు.