ఎల్లారెడ్డి ట్రైబల్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన రీజినల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్

 విద్యార్థినిలకు ఎలుకలు కొరకడం పై ఆరా తీసిన వైనం.
ఎల్లారెడ్డి, ఆగస్టు 5  (జనంసాక్షి ):  ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని  ట్రైబల్ గిరిజన గురుకుల విద్యార్థినిలకు ఎలుకలు కొరకడం తో పది మందికి పైగా పిల్లలకు కాళ్ళకు గాయాలు అయ్యాయి.  ఈ విషయం పై  శుక్రవారం ఉదయం మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్  ట్రైబల్ బాలికలపాఠశాలలో జరిగిన సంఘటన పై విద్యార్థినిల తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల  అవరణ లోకి ఎలుకలు  పాములు ఇతర కీటకాలు  రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని పాఠశాల సిబ్బందికి పలు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.  ఈ సందర్భంగా పాఠశాల ఏఎన్ఏం రాత్రి సమయం లో పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లాడానికి  ఒక వాహనం  ఏర్పాటు చేయాలని రీజినల్ కోఆర్డినేటర్  సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా అందుకు ఆయన అంగీకరించి  ఇంఛార్జి ప్రిన్సిపాల్  రమ్య శ్రీ  కి  అదేశాలు జారి చేసారు ట్రైబల్ బాలికల పాఠశాల కు  ప్రహరీ గోడ నిర్మాణానికి  ఉన్నత అధికారులకు  ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామని నిధులు మంజూరు కాగానే నిర్మాణాలు చేపడుతామని తెలిపారు. పాటశాల అవరణలో సీసీ కెమెరా లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే  సెక్యూరిటీ ని కూడా నియమిస్తామని అన్నారు  ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమ్య శ్రీ,   శ్రీ ప్రియ,తో పాటు ట్రైబల్ బాలికల  ఉపాధ్యాయురాళ్లు తదితులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు