ఎవరికీ రాని స్పష్టమైన మెజార్టీ

నల్లగొండ:  నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేతగా నిలవాలంటే 66,777 ఓట్లు కావాల్సి ఉంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరర్ రెడ్డికి 59,764 ఓట్లు రాగా, బీజేపీకి 47,041 ఓట్లు వచ్చాయి.  మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ 11,323 ఓట్ల ఆధిక్యంలో ఉంది. దాంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.