ఎవరినీ వదిలిపెట్టేది లేదు

mann-ki-baat-government-constructing-5-lakh-farming-pools-says-pm-narendra-modiనల్లధనాన్ని వెలికి తీయడానికి మరిన్ని చర్యలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా వెల్లడించారు. లెక్కల్లో చూపని డబ్బు ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసిన మోదీ, డిసెంబర్ 30తో గడువు పూర్తయ్యాక మరిన్ని చర్యలు తీసుకోబోమన్న గ్యారంటీ ఏమీ లేదన్నారు. అయితే నిజాయితీపరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ‘ఈ పథకం ముగిసిన తర్వాత మిమ్మల్ని (నల్ల కుబేరులు) శిక్షించడానికి కొత్తగా ఎలాంటి చర్యలూ ఉండబోవన్న గ్యారంటీ ఏమీ ఉండదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. నిజాయితీపరులకు ఎలాంటి సమస్యా ఉండదు. నా గురించి తెలిసిన వారు చాలాతెలివైన వారు కూడా. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి బదులు గంగానదిలో వేయడం మంచిదని అనుకుంటున్నారు. పుణ్యం కోసం గంగానదిలో ఒకరూపాయి కూడా వేయని వారు ఇప్పుడు 500, వెయ్యి రూపాయల నోట్లను పడేస్తున్నారు’ అని మోదీ అన్నారు. రద్దయిన వెయ్యి, 500 రూపాయలు గంగా నదిలో కొట్టుకొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ కోబే నగరంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దును ఆయన ‘స్వచ్ఛ అభియాన్’గా అభివర్ణిస్తూ నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రజలు సహరిస్తున్నారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు.