ఎవరు గెలిచినా ఏమున్నది? నేతన్నలకు లాభం

నేతన్నల బతుకు ఛిద్రం
వారి ఓట్లతో పదవులు పొందిన నేతల బతుకు భద్రం
నేటి చేనేత కార్మికుల జీవనం దరిద్రం
శ్రమజీవులు ఆకలితో చస్తుంటే పాలకులు చూస్తున్నారు చోద్యం
ప్రజా ప్రతినిధులు ఆకలి చావులను కూడా చేస్తున్నారు రాద్ధాంతం
నాయకులు మగ్గం కార్మికుల ప్రాణాలతో ఆడుతున్నారు చెలగాటం
ఇదిపద్మశాలీల బతుకు పోరాటం
అర్థాకలితో ఆవలిస్తూ ఆకలితో పస్తులుంటున్న
నేత కార్మికుల గుండె చప్పుడునెవరువినిపించుకుంటారు
అనారోగ్య సమస్యలతో కాటికి కాలు చాపుతున్న వృద్ధ శ్రామికుల
ఆక్రనందనలను ఎవరు ఆలకిస్తారు
నాయకుల వాగ్దానాలు పాలకుల హామీలు
కష్టజీవుల కడుపు నింపగలవా?
అధినేతల ఓదార్పులు ,అగ్రనేతల నిట్టూర్పులు
నిరుపేద చేనేతల జీవితాలు మార్చగలవా?
ఎవరు గెలచినా ఏమున్నది ?నేతన్నలకు లాభం
నీతిలేని నేతలున్నంత వరకు నేతన్నలకు తప్పదు శోకం
– కె.సురేశ్‌ బాబు
సుల్తానాబాద్‌
కరీంనగర్‌
సెల్‌:8019432895