ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవటం కాదు

– తెదేపా హయాంలోనే విజయనగరం అభివృద్ధి చెందింది

– నాలుగేళ్లలో ¬దాకోసం పవన్‌ ఏం చేశారో చెప్పాలి

– పవన్‌ పై విరుచుకుపడ్డ ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు

విజయనగరం, జూన్‌2(జ‌నం సాక్షి) : ప్రత్యేక ¬దా కోసం కేంద్రంతో తెగదెంపులు చేసుకొని కేంద్రంపై తీవ్రస్థాయిలో చంద్రబాబు పోరాడుతుంటే.. మద్దతు పలకాల్సిన పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబునే విమర్శించడం విడ్డూరంగా ఉందని, పవన్‌ పూర్తి అవగాహన రాహిత్యంతో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తున్నాడని మంత్రి సుజయ కృష్ణ రంగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ప్రజాపోరాట యాత్ర లక్ష్యం ఏంటో తెలియడం లేదన్నారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ¬దా కోసం సీఎం పోరాడుతున్నారని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి అందరినీ కలిశారని గుర్తుచేశారు. కాగా ఏపీ విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. నాలుగేళ్లలో ¬దా కోసం పవన్‌ ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని విమర్శించకుండా సీఎం చంద్రబాబునే విమర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో మైనింగ్‌, ఇసుక మాఫియా లేదని, ఎవరో చెప్పింది చదవడం కాదు వాస్తవాలు గ్రహించాలని మంత్రి సూచించారు. టీడీపీ హయాంలోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. నిరుద్యోగుల పాలిట వరం నిరుద్యోగ భృతి అని దాన్ని తప్పుపట్టడం అవివేకమని మండిపడ్డారు. ఆనాడు రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లో అన్న చిరంజీవి తన పార్టీని విలీనం చేస్తే…ఇప్పుడు రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని విమర్శించకుండా తమ్ముడు పవన్‌.. సీఎంపై బురదజల్లుతున్నారని మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు దుయ్యబట్టారు. ఇప్పటికైన పవన్‌ తన తీరును మార్చుకోవాలని, తద్వారా రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని కోరారు.