ఎసిబి వలలో సంగారెడ్డి ఆస్పత్రి అధికారులు

సంగారెడ్డి,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డాక్టర్‌ హైమావతి సర్వీస్‌ పొడిగింపునకు రూ. 80 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో హైమావతి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మంగళవారం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ మురారి, సీనియర్‌ అసిస్టెంట్‌ నరేందర్‌గౌడ్‌ ఇద్దరు కలిసి హైమావతితో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిద్దరి నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.